
లింగసముద్రం మండలంలో సందడిగా కార్యక్రమాలు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:-
జగన్ ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంతలే. ఒక్క తట్ట కూడా మట్టి వేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామీణ రోడ్లకు మోక్షం కలిగింది. పల్లె పండుగ 1,2, పీఎంజిఎస్ వై, నాబార్డ్, ఆర్ అండ్ బి తదితర నిధులతో ఈ రెండున్నర సంవత్సరాలలో నియోజకవర్గంలో 42.64 కోట్లతో 17 తారురోడ్లను నిర్మించాం…. అని కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా 6 గ్రామాలకు కొత్తగా తారురోడ్లు నిర్మించేందుకు 9.10 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అందులో భాగంగా…. లింగసముద్రం మండలంలో RR పాలెంలో PMGSY కింద 1.15 కోట్లతో నిర్మించనున్న తారురోడ్డు, 1.97 కోట్లతో నిర్మించనున్న విశ్వనాధపురం - గంగపాలెం తారురోడ్డు, 90 లక్షలతో నిర్మించనున్న మేదరమిట్లపాలెం - జంగాలపల్లి తారురోడ్డు పనులకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఇన్నేళ్ల కష్టాలు తొలగేలా, తమ గ్రామాలకు కొత్తగా రోడ్లు ఏర్పాటు చేయబోతున్నందుకు… ఆయా గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ, మూడు కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేళ తాళాలతో నాగేశ్వరరావుకు స్వాగతం పలికారు. ప్రతి గ్రామానికి తారురోడ్డు, అంతర్గతంగా సిసి రోడ్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడమే నా లక్ష్యం. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా పల్లెల్లో కళ వచ్చింది. గ్రామీణ ప్రాంతాలను అన్ని విధాలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాను… అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శంకుస్థాపనల అనంతరం… మూడు చోట్ల ప్రజల నుంచి ఎమ్మెల్యే గారు అర్జీలు స్వీకరించారు. వాటి పరిష్కారంపై అధికారులకు అక్కడే ఆదేశాలు ఇచ్చారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, మూడు గ్రామాలలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను ఎమ్మెల్యే నాగేశ్వరరావు వివరించారు. అంతకుముందు ఆర్ఆర్ పాలెం వద్ద పొగాకు నారుమడిలో పనిచేస్తున్న కూలీలతో ఎమ్మెల్యే ముచ్చటించారు. వారి వద్దకు స్వయంగా వెళ్లి సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఎన్నికలకు ముందు చెప్పిన హామీలను దాదాపు నెరవేర్చాం. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. పార్టీలకు అతీతంగా పథకాలు చేరుతున్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకుని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు సహకారం అందించి గెలిపించాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలలో మండల టిడిపి అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం, క్లస్టర్ ఇంచార్జ్ వంకాయలపాటి మాల్యాద్రి, గ్రామ పార్టీల అధ్యక్షులు కిలారి వెంకటేశ్వర్లు, ఉన్నం రమేష్, కూరపాటి విజయ భాస్కర్, త్రోవగుంట వెంగళరావు, పార్టీ నాయకులు కిలారి రవి, కేతినేని మహేష్, వీరభద్రయ్య, బొల్లినేని నాగేశ్వరరావు, ఉన్నం వీరాస్వామి, కూరపాటి శ్రీను, సోంపల్లి మనోహర్, రాజారపు మాలకొండయ్య, పల్లపోతు వెంగళరావు, కిలారి కొండయ్య, అడపా రంగయ్య, నరసయ్య, కొండపనాయుడు, పూరిమిట్ల మాల్యాద్రి, గొర్రెపాటి సాంబయ్య, నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.