
తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:-
పొన్నలూరు, పొన్నలూరు నూతన ఎస్సైగా శివనాగరాజు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడ ఉన్న ఎస్ఐ సత్యనారాయణ బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్సై శివనాగరాజు మాట్లాడుతూ పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. పేకాట, జూదం, గంజాయి తదితర అసాంఘిక కార్యకలాపాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.