
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:
టంగుటూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త టంగుటూరు రమేష్ గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఒంగోలులోని అమృత హాస్పిటల్లో గుండె శస్త్రచికిత్స (బైపాస్ సర్జరీ) జరిగింది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో కోలుకుంటున్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే టంగుటూరు మండల జనసేన పార్టీ నాయకులు స్పందించారు. ఒంగోలు అమృత హాస్పిటల్‌కు వెళ్లి రమేష్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రమేష్ వైద్య ఖర్చుల నిమిత్తం టంగుటూరు మండల జనసేన పార్టీ తరఫున రూ. 14,000 (పద్నాలుగు వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టంగుటూరు మండల మాజీ అధ్యక్షులు కందుకూరి రాంబాబు , పేర్ల మురళి, బత్తుల నాగరాజు,టంగుటూరి కృష్ణ, మరియు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు