
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
కోవూరు తాలూకా నాన్-గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఎన్జీవోస్) ప్రతినిధులు ఇటీవల తమ సమస్యలపై అందించిన వినతిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఎమ్మెల్యే గారు తెలిపారు.ఉద్యోగుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇప్పటికే రెండు విడతల కరువు భత్యం (డీఏ) విడుదల చేయడమే నిదర్శనమన్నారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేసే కొత్త పథకాలు, కార్యక్రమాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే కోరారు.