
శ్రీకృష్ణనగర్, గోపాల్‌నగర్ ఎక్స్టెన్షన్, మహేంద్రనగర్‌లో ప్రత్యేక తనిఖీలు – సున్నిత పోలింగ్ ప్రాంతాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌నగర్ ఎక్స్టెన్షన్లో సీఐ, ఎస్ఐల ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. ప్రాంతంలోని అనుమానాస్పద వ్యక్తులు, ఇళ్లు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.అదేవిధంగా ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సున్నితమైన పోలింగ్ ప్రాంతమైన మహేంద్రనగర్‌లో ప్రత్యేక CASO నిర్వహించి భద్రతా పరిస్థితులను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు.శ్రీకృష్ణనగర్‌లో CASO అనంతరం ఒంగోలు తాలూకా సీఐ ఆధ్వర్యంలో ప్రజలకు మహిళలపై నేరాలు మరియు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికల భద్రత, సైబర్ మోసాల పట్ల అప్రమత్తత, అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు మరియు లింకులకు స్పందించకుండా జాగ్రత్త వహించడం వంటి అంశాలపై ప్రజలకు సూచనలు చేశారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, నేరాల నియంత్రణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని సూచించారు.నేరాల నియంత్రణ – ప్రజల భద్రత – ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక తనిఖీలు, నిఘా మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.