
పాల్గొన్న కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 265 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం కలెక్టరేట్లో జిల్లా స్థాయి వర్చువల్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, అవసరమైన వైద్య సేవలు గ్రామస్థాయిలోనే అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.ప్రజలు విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సూచించార