
తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:-
ఈ నెల 9 న సీఎం చంద్రబాబు కొండపి నియోజకవర్గ పర్యటన కోసం మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కలెక్టర్ పి.రాజాబాబు గార్లతో కలసి జరుగుమల్లి మండలం నర్సింగోలులో హెలిప్యాడ్, ప్రజా వేదిక, పార్టీ క్యాడర్ మీటింగ్ కోసం స్థలాన్ని పరిశీలించాను. అనంతరం సీఎం గారి పర్యటన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు అందించాను. సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, ఎక్కడ చిన్నపాటి లోపం కూడా ఉండకూడదని, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నేతలు సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చాను.