
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
నెల్లూరు టౌన్‌హాల్ వీఆర్సీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ధీరనారి యువతీ సమ్మేళనం’లో పాల్గొని విద్యార్థినులతో మాట్లాడాను.మార్కులు తగ్గాయని నిరాశ చెందకుండా, కష్టాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులతో పంచుకోవాలి. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది.‘తలవంచేది కాదు.. తరం మార్చేది యువతి’ అనే స్ఫూర్తితో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో ముందుకు సాగాలి. ఓటమి ఎదురైనా వెనక్కి తగ్గకుండా పట్టుదలతో లక్ష్యాలను సాధించాలి.తమ భవిష్యత్తుతో పాటు సమాజం, తమ గ్రామాల అభివృద్ధి గురించి ఆలోచిస్తున్న నేటి యువతను అభినందిస్తున్నాను. మీ ఆలోచనలు, మీ సంకల్పమే దేశ భవిష్యత్తుకు బలం.