
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గ :-
పల్లిపాడు గ్రామంలో గత 40 ఏళ్లుగా హెల్త్ క్లినిక్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఆ సమస్యకు పరిష్కారం చూపుతూ ఈరోజు రూ.36 లక్షలతో నిర్మించిన నూతన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించాను. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 4,472 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణానికి రూ.1,128 కోట్లు కేటాయించింది.ఇందుకూరుపేట మండలంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.1.44 కోట్లతో కొరుటూరు, సోమరాజుపల్లి, ఇందుకూరుపేట బిట్ 1-2, పల్లిపాడు ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. ఇకపై చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.అలాగే ‘పల్లె పండుగ 3.0’లో భాగంగా కోవూరు నియోజకవర్గానికి రూ.9.60 కోట్లతో 217 అభివృద్ధి పనులు చేపడుతున్నాం. పల్లిపాడులో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు కూడా శ్రీకారం చుట్టాం.అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, ఇంటి స్థలం అందేలా చర్యలు తీసుకుంటాం. డిసెంబరు 1 నుంచి అర్హులైన వారికి కొత్త పింఛన్లు అందిస్తాం.పెన్నానదికి రక్షణగా పొర్లుకట్ట నిర్మించాలన్న ప్రజల అభ్యర్థనను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాం. ఇది పెద్ద ప్రాజెక్టు అయినప్పటికీ, తప్పకుండా మంజూరు చేయించి నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తాను.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు మనస్పర్థలను పక్కనబెట్టి ఐక్యంగా పనిచేయాలి. ఇందుకూరుపేట మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలన్నింటినీ గెలుచుకుని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా అందిద్దాం.