
తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:-
తూర్పు గంగవరం (తాళ్లూరు మండలం)లో “సేవా సంకల్ప్ అభియాన్”లో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా ప్రజాసేవకే అంకితమైన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి, సంక్షేమ పథంలో ముందుకు సాగుతోందని అన్నారు.కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు.తూర్పు గంగవరం పంచాయతీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా టీడీపీ నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, టీడీపీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.