
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సుదీర్ఘ ప్రజా ప్రస్థానాన్ని స్మరించుకుంటూ, ఆయన సేవా సంకల్పానికి కృతజ్ఞతగా కోవూరులో నిర్వహించిన ‘సేవా జ్యోతి యాత్ర’లో పాల్గొన్నాను.ప్రజా జీవితంలో ఎక్కువ కాలం ఉండటం ఒక విషయం… ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడం మరో విషయం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవ మనకు స్పష్టంగా చూపించింది.దేశం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ గారు. మహిళల సాధికారత నుంచి దేశ భద్రత వరకు, పేదల సంక్షేమం నుంచి అభివృద్ధి వరకు ప్రతి రంగంలోనూ ఆయన నాయకత్వంలో భారత్ ఎన్నో మార్పులను చూసింది.గుజరాత్లో ఎన్నో సవాళ్లు ఎదురైన సమయంలో బాధ్యతలు చేపట్టి, వాటిని అవకాశాలుగా మలచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకత్వం మోదీ గారిది.భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న మోదీ గారితో కలిసి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తుండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో శుభపరిణామం.బీజేపీ, జనసేన, టీడీపీ సమన్వయంతో కోవూరులో సేవా జ్యోతి యాత్ర నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవకు ఇది మా కృతజ్ఞతా నివాళి.