
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ మున్సిపాలిటీ – 2026 రాష్ట్రస్థాయి అవార్డుకు గిద్దలూరు మున్సిపాలిటీ ఎంపికై, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఈ.వి. రమణబాబు ను గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులు ముత్తుముల క్రిష్ణ కిషోర్ రెడ్డి అభినందించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఈ.వి. రమణబాబు మాట్లాడుతూ, గిద్దలూరు మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో ముందంజలో ఉండేందుకు ముత్తుముల క్రిష్ణ కిషోర్ రెడ్డి గారి సహకారం మరువలేనిదని కొనియాడారు.