
తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం :-
కురిచేడు మండలం కల్లూరు గ్రామంలో రూ.3.80 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను డా. గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రారంభించారు.ఈ సబ్‌స్టేషన్‌తో కల్లూరు పరిసర గ్రామాల్లో లో వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, వ్యవసాయానికి, ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందనుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో దర్శి నియోజకవర్గంలో విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని డా. లక్ష్మీ గారు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లోనూ నాణ్యమైన విద్యుత్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.