
తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం :-
ముండ్లమూరు మండలం పెద్ద ఉల్లగల్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 KV సబ్‌స్టేషన్‌ను విద్యుత్ శాఖ సీఎండీ పుల్లారెడ్డి గారితో కలిసి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలో దర్శి నియోజకవర్గంలో విద్యుత్ శాఖ ద్వారా దాదాపు రూ.200 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.గంగవరం, పెద్ద ఉల్లగల్లు, కల్లూరులో సబ్స్టేషన్లు, దర్శిలో DE కార్యాలయం, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, అత్యవసర పనులతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచిత సోలార్ సదుపాయాలు కల్పించామని వెల్లడించారు.ఊరూరా విద్యుత్ వెలుగులు… కూటమి ప్రభుత్వంలోనే సాధ్యం. ప్రజల అవసరాలే లక్ష్యంగా దర్శి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని డాక్టర్ లక్ష్మీ తెలిపారు.