
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
అక్టోబర్ 10న జరుపుకునే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, సింగరాయకొండ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో , మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, సానుకూల ఆలోచనలు, భావోద్వేగాల నియంత్రణ, ఒత్తిడిని అధిగమించడం, సమస్యలను ఇతరులతో పంచుకోవడం వంటి అంశాలపై అవగాహన అవగహన.ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల విద్యాశాఖ అధికారి కె. శ్రీనివాస్ రావు పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు G యాకోబు గారఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది మరియు సమగ్ర శిక్ష – అభియాన్ కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ రావూరు లక్ష్మణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరికీ ముఖ్యమని, మనసులోని బాధలను దాచుకోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు లేదా నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవాలని సూచించారు. మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు సహాయం కోరడం బలహీనత కాదని, అది ధైర్యానికి నిదర్శనమని తెలియజేశారు.
విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, సానుకూల దృక్పథాన్ని అలవర్చడం, ఒకరికొకరు సహకరించుకునే మనస్తత్వాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. బాధను పంచుకోవడం బలహీనత కాదు – ధైర్యం మాత్రమే!”
మానసిక ఆరోగ్యం మనందరి బాధ్యత – ఆరోగ్యకరమైన మనసుతోనే ఆనందమయమైన జీవితం!