
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
కొత్తపట్నం మండలం, మోటుమాల గ్రామంకు చెందిన పి .పద్మావతి అనారోగ్యంతో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒంగోలు నందు చికిత్స పొందుతుండగా… వారి మెడికల్ రిపోర్టులను పరిశీలించి వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి… మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక డాక్టర్ గారిని కోరుతూ పద్మావతి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని కల్పించి పరామర్శించిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC ) సభ్యులు, కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య.