
వెలుగొండ సందర్శనకు వెళ్లి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దు..
మార్కాపురం గ్రామీణ ఎస్సై వేమన సూచన…
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:
దసరా సెలవులను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందంగా గడపాలని మార్కాపురం గ్రామీణ ఎస్సై వేమన సూచించారు. సెలవుల సమయంలో పిల్లలు సరదాగా గడిపే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలకు గురికాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.దసరా సెలవుల్లో విద్యార్థులు వెలుగొండ ప్రాంతాన్ని సందర్శించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై హితవు పలికారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లడం, భద్రతా నియమాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించేటప్పుడు పెద్దల పర్యవేక్షణలోనే వెళ్లాలని సూచించారు.పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితో వెళ్తున్నారు? అనే విషయాలపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి సారించాలని తెలిపారు. సెలవుల సమయంలో విద్యార్థుల భద్రతే ముఖ్యమని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర ప్రమాదాలకు దారితీయవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీసుల సూచనలు పాటిస్తూ దసరా సెలవులను సురక్షితంగా, సంతోషంగా గడపాలని గ్రామీణ ఎస్సై వేమన కోరారు…