
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని కోటారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పాకల బీచ్ లో ప్రమాదానికి గురైన మార్కాపురం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన బత్తుల నరసింహారావు ఈ సాయంత్రం కలెక్టర్ పి.రాజాబాబు, సబ్ కలెక్టర్ డి.హిమవంశి పరామర్శించారు. నరసింహారావు ఆరోగ్య పరిస్థితిని గూర్చి డాక్టర్ సాకేత్ ను అడిగి తెలుసుకున్నారు. అపస్మారక స్థితి లో వచ్చిన బత్తుల నరసింహారావుకు సరైన సమయంలో మంచి చికిత్స అందించి కాపాడినందుకు డాక్టర్ సాకేత్ ను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ ఇంద్రాణి, రూరల్ ఎస్సై బాలకృష్ణ పాల్గొన్నారు.