
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో అరుణ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో భాగంగా అరుణ అత్తగారు శీలం కోటేశ్వరి గారి సహకారంతో పుచ్చలపల్లి సుందరయ్య నగర్లో నివసిస్తున్న నిరుపేద విద్యార్థులకు భోజనం, వాటర్ బాటిళ్లు, కేక్ పంపిణీ చేయడం జరిగినది.ఈ సందర్భంగా జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ, ప్రతి నెల 10వ తేదీన దాతల సహకారంతో సమితి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిరుపేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం అందించడమే తమ సమితి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.పుట్టినరోజులు, ఇతర శుభ సందర్భాల్లో నిరుపేదలకు సహాయం అందించడం ఎంతో అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆనందాన్ని నింపడంతో పాటు సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రేమ్ బాబు, వేణు బాబు, సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.