
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
పాకల బీచ్ వద్ద సముద్రంలో రిప్ కరెంట్స్ (తీవ్రమైన సముద్ర ప్రవాహాలు) ప్రమాదం అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ప్రజల భద్రత దృష్ట్యా 11.10.2026 నుండి 15.10.2026 వరకు పాకాల బీచ్‌ను తాత్కాలికంగా మూసివేయడమైనది.ఈ కాలంలో బీచ్‌లోకి ప్రవేశించడం, సముద్రంలో స్నానం చేయడం పూర్తిగా నిషేధించబడింది. ప్రజలు, పర్యాటకులు ఈ ఆదేశాలను పాటించి, తమ ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా కోరడమైనది. తహసీల్దార్ మరియు మండల మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ , సింగరాయకొండ మండలం