
తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం :-
దర్శి టీడీపీ కార్యాలయంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా 97 మంది లబ్ధిదారులకు రూ.47,85,484 విలువైన చెక్కులను ఆమె పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు CMRF ఎంతో భరోసానిస్తోందని, ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.