
తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:-
దర్శి పట్టణంలోని NAP చెరువు వద్ద రూ.35 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 2 MLD మైక్రో ఫిల్టర్లను ప్రారంభించిన దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడంతో పాటు, ప్రజల అవసరాలకు అనుగుణంగా దర్శి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు తెలిపారు.