
ప్రజల భద్రతే లక్ష్యంగా ఒంగోలు వన్ టౌన్ పోలీసుల ఫుట్ పెట్రోలింగ్
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ఒంగోలు నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించడం, ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో భాగంగా ఒంగోలు వన్ టౌన్ సీఐ గారు ప్రత్యేక పోలీసు బృందంతో కలిసి విస్తృతంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని పాత మార్కెట్ ప్రాంతం, బండ్లమిట్ట, అద్దంకి బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ భద్రతా పరిస్థితులను పర్యవేక్షించారు. ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో పోలీసుల ఉనికిని చాటుతూ, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టారు.నగరంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, నేరాల నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.