
అమరావతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 1,100 సైకిళ్ల పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలులోని మినీ స్టేడియంలో అమరావతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దనరావు గారి చేతుల మీదుగా 1,100 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ పిల్లలు సైకిళ్లు కావాలని కోరినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారి కోరికను తీర్చలేకపోయామని కొందరు తల్లిదండ్రులు పేర్కొన్నారు. అయితే, జనార్దనరావు గారు తమ పిల్లల కోరికను తీర్చి, వారి సైకిల్ కలను సాకారం చేశారని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి శాసనసభ్యులు ఎంతో కృషి చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల సంక్షేమం, ఉన్నతికి అనేక మార్పులు, చేర్పులు చేపడుతూ విశేష కృషి చేస్తోందని పలువురు తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఈ కార్యక్రమాన్ని అమరావతి సేవా ట్రస్ట్ వారు ఘనంగా నిర్వహించి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దనరావు గారు మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులందరికీ సైకిళ్లు పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అమరావతి సేవా ట్రస్ట్ సభ్యులను ఆయన అభినందించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని శ్రీ దామచర్ల జనార్దనరావు గారు జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సైకిళ్ల పంపిణీకి ఆర్థిక సహకారం అందించిన దాతలు, ధనిక్ భ