
కూటమి ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పనులు పునఃప్రారంభం – డా గొట్టిపాటి లక్ష్మీ
తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:-
దర్శి నియోజకవర్గ అభివృద్ధికి కీలకమైన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, ఆర్అండ్బీ అధికారులతో కలిసి పనులను ప్రారంభించారు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014లో సుమారు ₹22 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపోయాయి. తిరిగి పనులు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పలుమార్లు కోరినట్లు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు అనుగుణంగా తొలి విడతలో సుమారు ₹9 కోట్లతో పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయడం దర్శి ప్రజలకు శుభపరిణామమని పేర్కొన్నారు.రెండేళ్ల కూటమి పాలనలో దర్శి అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మినీ స్టేడియం, క్రికెట్ స్టేడియం, డిగ్రీ కళాశాల, కోల్డ్ స్టోరేజ్, టీటీడీ కల్యాణ మండపం, అన్నా క్యాంటీన్ వంటి కార్యక్రమాలతో పాటు రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.