
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట ప్రాంతంలో, పొన్నలూరు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. అలాగే గుడ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, లింగసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నిబోయినపల్లి గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ గ్రామంలో భద్రతా పరిస్థితులను పరిశీలించారు.ఈ తనిఖీల సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, నేరాలకు అవకాశం ఉన్న అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు.
ప్రజలకు పలు అంశాలపై అవగాహన రోడ్డు భద్రత: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించాలని, సీట్బెల్ట్ ఉపయోగించాలని, అతివేగం మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్కు దూరంగా ఉండాలని సూచించారు.సైబర్ నేరాల నివారణ: గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించారు.మహిళలు, చిన్నారుల రక్షణ: మహిళలు, చిన్నారుల పట్ల వేధింపులకు పాల్పడటం చట్టరీత్యా నేరమని, ఇటువంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన: గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యానికి, భవిష్యత్తుకు హానికరమని, వాటికి దూరంగా ఉండాలని, అక్రమ కార్యకలాపాల సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.ఎన్నికల సంబంధిత అంశాలు: ఎన్నికల సమయంలో చట్టాలను, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ల ద్వారా నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు కృషి చేస్తున్నారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ, అనుమానాస్పద కార్యకలాపాలు లేదా చట్టవిరుద్ధ చర్యలపై సమాచారం అందించాలని కోరుతున్నారు.ప్రజల భద్రతే మా బాధ్యత – నేరాల నియంత్రణే మా లక్ష్యం – శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారమే మా బలం!