
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు (CASO) నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూబగుంట గ్రామంలో, లింగసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నెబోయినపల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి, ఆయా ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను పరిశీలించారు.దూబగుంట గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా స్థానిక దుకాణాలను కూడా పోలీసులు పరిశీలించారు. అనుమానాస్పద, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తూ, నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టారు.అదేవిధంగా అన్నెబోయినపల్లి గ్రామంలో నిర్వహించిన CASOలో భాగంగా గ్రామ పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రజలకు భద్రత కల్పిస్తూ, నేరాలకు అవకాశం లేకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు.ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం!గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం, నేరాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచడం లక్ష్యంగా పోలీసులు ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు.ప్రజలు పోలీసులకు సహకరించాలని, తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు.