
దేశానికే ఆదర్శంగా మన రాష్ట్ర సంక్షేమం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమిని ఆశీర్వదించాలి
మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ అమరావతి:-
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన సాగుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తో కలసి లింగసముద్రం మండలం పెద్దపవనిలో ఎస్టీ కాలనీలో సిసి రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్ద పవనిలో కస్తూర్బా గాంధీ బాలికల కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ..అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన సాగుతోంది. సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం.
దేశానికే ఆదర్శంగా మన రాష్ట్ర సంక్షేమం నిలుస్తోంది. దేశంలో ఏ రాష్ర్టంలో లేని విధంగా పెద్ద మెత్తంలో ఫించన్లు ఇస్తున్నాం. అన్న క్యాంటీన్లతో పేదలకు రూ. 5 భోజనం పెడుతున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. పాఠశాలల బలోపేతం, తల్లికి వందనంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్డులు సంఖ్య గనణీయంగా పెరిగింది, స్త్రీ శక్తికి సమర్దవంతంగా అమలు చేస్తున్నాం ఎన్నికల్లో చెప్పకపోయినా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమిని ఆశీర్వదించాలని మంత్రి కోరారు.