
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:-
లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన 6 కుటుంబాల వారు.. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి సమక్షంలో మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పల్లాల శివయ్య, పల్లాల నారాయణరెడ్డి, పిచ్చపాటి వెంకటయ్య, పల్లాల వీరబ్రహ్మయ్య, రొడ్డ యేసుదాసులకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆయన చిత్తశుద్ధి తమను ఎంతగానో ఆకర్షించాయని, ఇకనుంచి ఆయన అడుగుజాడల్లో పనిచేస్తామని కొత్తగా చేరిన వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు.గ్రామ నాయకులు పల్లపోతు వెంగళరావు, నీటి సంఘం చైర్మన్ బాసం పెద మాలకొండయ్య, వేముల రామారావు, కంచర్ల రవీంద్ర, పెన్నా మల్లికార్జున, పోకూరి కొండలరావు, ఓరుగంటి అనిల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.