
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా లో విదేశీయులకు ఆశ్రయం కల్పించే హోటల్స్ , గెస్ట్ హౌస్లు, గృహ యజమాన్యాలు, ఆసుపత్రులు, హాస్టళ్లు, ఆశ్రమాలు, సత్రాలు, విద్యాసంస్థలు ఇతర సంస్థల నిర్వాహకులు, యాజమాన్యాలు తప్పనిసరిగా వారి వద్ద ఆశ్రయం పొందే విదేశీయుల రాక, బస మరియు బయలుదేరే వివరాలను (OCI కార్డుదారులు, నేపాల్ మరియు భూటాన్ దేశాల పౌరులతో సహా) నిర్దేశిత విధానంలో డిజిటల్ రిపోర్టింగ్ (form–III/ form-C) ద్వారా తప్పనిసరిగా నమోదు చేసి ఎఫ్.ఆర్.ఓ. (ఫారనర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్/సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) వారికి 24 గంటల సమయంలోగా తెలియజేయాలి. వివిధ దేశాల నుంచి జిల్లాకు వివిధ పనులు, విద్య, వైద్యం, పర్యటన, ఇతర అవసరాల నిమిత్తం వచ్చే విదేశీయులు, పాస్పోర్టు, వీసా, వ్యక్తిగత వివరాలు, వసతి వివరాలు, వచ్చిన తేదీ తదితర నిర్దేశిత వివరాలను ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం 2025, సెక్షన్ 8 ప్రకారం తప్పనిసరిగా వెబ్ సైట్ (https://indianfrro.gov.in/frro/FormC/login.jsp) ద్వారా నమోదుచేసి 24 గంటలలోగా ఎఫ్.ఆర్.ఆర్.ఓ (FRRO) మరియు ఎఫ్.ఆర్.ఓ.(FRO) కార్యాలయాలకు సకాలంలో అందించాల్సిన బాధ్యత వారికి వసతి, ఆశ్రయం కల్పించే సంస్థలపై ఉంది. సంబంధిత ఆన్లైన్ వ్యవస్థలో నమోదు చేయడంలో సంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యం చేయరాదు.నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: విదేశీయుల వివరాలను నిర్దేశిత పోర్టల్ ద్వారా నమోదు చేయకుండా నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరించినట్లయితే యాజమాన్యాలపై ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం 2025, సెక్షన్ 23(బి) ప్రకారం రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు జరిమాన లేదా 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు లేదా రెండూ విధించే అవకాశం ఉంది. అందువల్ల హోటల్ యాజమాన్యాలు, గెస్ట్హౌస్లు, వ్యక్తిగత గృహ యజమానులు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు మరియు ఇతర సంబంధిత సంస్థలు విదేశీయులకు వసతి లేదా సేవలు కల్పించే సమయంలో చట్టపరమైన విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలి. జిల్లాకు వచ్చే విదేశీయులు భారతదేశ చట్టాలను గౌరవించాలని, చెల్లుబాటులో ఉన్న వీసా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.