
ఎన్నికల నియమ నిబంధనలు తూచా తప్పక అమలు చెయ్యాలి.
సిబ్బంది పని చేసే కేంద్రం లో అందుబాటులో ఉండాలి.
రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుకు వెయ్యాలని గ్రామ పంచాయతీల సిబ్బందికి ఇంచార్జి ఎం పి డి వో వెంకట్రావు ఆదేశం
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం తో జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలతో సింగరాయకొండ మండల పరిషత్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి దారా వెంకటరావు ఎన్నికల నిర్వహణ కి సమాయత్తం చేశారు. ఎన్నికల నిర్వహణ విషయంలో సిబంది ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండకుండా భాద్యతగా పనిచేయాలని కోరారు. గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ నాయకుల విగ్రహాలు ఫోటోలు తప్ప రాజకీయ నాయకుల ఫోటోలు శిలా ఫలకాలకు ముసుకులు వెయ్యాలని, పేపర్ లు అంటించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.ఈ సందర్భంగా కార్యాలయ పరిపాలన అధికారి. శ్రీనివాస రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.