
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
మాజీ రాష్ట్రపతి, భారతరత్న, స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95 వ జయంతిని కందుకూరు టిడిపి కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు.ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కలాం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.దేశం గర్వించేలా శాస్త్రవేత్తగా అనేక సేవలు అందించారని, రాష్ట్రపతి పదవికి కూడా వన్నెతెచ్చారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు కొనియాడారు.కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, రూరల్ అధ్యక్షుడు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ బాషా, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ మున్నా, ఫిరోజ్, ఖాదర్, వార్డు అధ్యక్షులు గౌస్ బాషా, నాయక్ రసూల్, నజీర్, ఆల్ బాషా, మైనారిటీ నాయకులు జియావుద్దీన్, నాయబ్ రసూల్, వలీబాషా, కాలేషా, అర్షద్, గౌస్ బాషా, రెహమాన్, ఖుద్దూస్, సయ్యద్, సుభాని తదితరులు పాల్గొన్నారు.