
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఉగ్రనరసింహా రెడ్డి గారి నాయకత్వంలో కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ దూసుకుపోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామలా కాశిరెడ్డి గారు, ఇంద్రభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెలిగండ్ల మండలంలో 20 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి. ఎమ్మెల్యే ఉగ్రనరసింహా రెడ్డి గారు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.