
తొలి శుభోదయం న్యూస్ పుంగనూరు:-
పుంగనూరు నియోజకవర్గం లోని టీడీపీ కార్యాలయం లో పుంగనూరు అల్లర్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు కూటమి నేతలతో కలిసి పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య.పుంగనూరు అల్లర్లకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డే ప్రధాన కుట్రదారులు. ఎంతమందిని చంపాలని కారులో కూర్చుని ఫీట్లు చేయించావని మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని, చంద్రబాబు అక్రమ అరెస్ట్, లోకేష్ పాదయాత్ర అడ్డుకోవడం నాటి అరాచకాలకు నిదర్శనమని మండిపడ్డారు.వైసీపీ కుట్రలను తిప్పకొట్టి స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులదే విజయమని స్పష్టం చేశారు.