
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
కోవూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరింది. బుచ్చిరెడ్డిపాళెం రూరల్, పంచేడు గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నేతలు 30 మందికిపైగా ఈరోజు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.వీపీఆర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తుమ్మల ప్రసాద్, సూరా మురళి ఆధ్వర్యంలో వచ్చిన నేతలకు వేమిరెడ్డి దంపతులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.