
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-
పంచేడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు కోవూరులో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంలో మీరంతా భాగస్వాములు కావాలని కోరుతున్నాను.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేసి, ప్రజల మద్దతుతో ఘనవిజయం సాధిద్దాం.