
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:
ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీయడం, క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా సింగరాయకొండలో నిర్వహించిన దసరా నాన్-మెడలిస్ట్ టోర్నమెంట్–2026 ఉత్సాహభరితంగా సాగింది. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ బ్యాడ్మింటన్ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి క్రీడాభిమానులను ఆకట్టుకున్నారు.సింగరాయకొండలోని ఐతా రామయ్య శ్రేష్ఠి–గడ్డం వీర రాఘవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏసీ ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. వేగవంతమైన స్మాష్లు, ఉత్కంఠభరితమైన ర్యాలీలు, ప్రతి పాయింట్ కోసం ఆటగాళ్లు చేసిన పోరాటం పోటీలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.జనరల్ పూల్ విభాగంలో కందుకూరు నుండి శ్రీనాథ్,ప్రణయ్ మొదటి స్థానం, సింగరాయకొండ ఇండోర్ స్టేడియంలో ఆడుతున్న రసూల్, శేషయ్య ఇండోర్ రెండవ స్థానం, టంగుటూరు నుండి గోవింద్, రాహుల్ ద్వితీయ బహుమతి మరియు చల్లా గోపి, సన్నెబోయిన కార్తీక్ నాలుగో బహుమతి గెలుచుకున్నారు.అదేవిధంగా 45 సంవత్సరాలు వయసు విభాగంలో విజేతలు మొదటి బహుమతి అశోక్,బాడితల శ్రీనివాసరావు,రెండో బహుమతి అనాల రవీంద్ర మరియు శ్రీనివాసరెడ్డి గెలుపొందారు.ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పోటీలను ఆసక్తికరంగా మార్చారు. గెలుపొందిన క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేయగా, మిగిలిన క్రీడాకారులు కూడా క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరాయకొండ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు,శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు మాట్లాడుతూ ఇలాంటి టోర్నమెంట్ల నిర్వహణ ద్వారా బ్యాడ్మింటన్ క్రీడకు మరింత ప్రాచుర్యం లభించడంతో పాటు, క్రీడాకారుల మధ్య స్నేహభావం, ఆరోగ్యకరమైన పోటీ తత్వం పెంపొందుతాయని,అదేవిధంగా గెలుపోటములు సహజం,క్రీడాస్ఫూర్తితో ఆడటమే అసలైన విజయని అన్నారు.కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వహణ కమిటీ సభ్యులు, శ్రీనివాస్, నాయుడు కుమార్, అంకారావు, రవి, శేషయ్య, రసూల్,న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్ కు వచ్చిన ఆటగాళ్ళకు మధ్యాహ్నం సాయంత్రం ఉచిత భోజనం ఏర్పాటు చేశారు.