
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కందుకూరు పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద సాగర్ హోం అప్లయన్సెస్ షోరూంను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు సోమవారం ఉదయం ప్రారంభించారు.నిర్వాహకులు మునీర్ కు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ…. వ్యాపారం వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, డాక్టర్ అజ్మల్ హుస్సేన్, పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, టిడిపి నాయకులు వడ్లమూడి చెంచు నారాయణ, చీదెళ్ల పిచ్చయ్య, రాజారెడ్డి, ఖలీల్, వలేటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.