
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు,సిద్ధాంతాలు నచ్చి జగనన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ నాయకత్వంను బలపరుస్తూ కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామం నుండి సొసైటీ మెంబర్ బండి రమణారెడ్డి ఆధ్వర్యంలో పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బుర్రా.మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ తల్లి లాంటిదని పార్టీ కోసం పనిచేసే వ్యక్తులను హక్కున చేర్చుకుంటుందని ప్రజాసేవలో పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీ అత్యున్నత అవకాశాలు ఇస్తుందని అన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి ఎప్పుడు ఆహ్వానం ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలో కుల,మత, ప్రాంతీయ భేదాలను మరిచి కలసికట్టుగా పనిచేసి తిరిగి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని నియోజకవర్గంలో సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు పార్టీ సిద్ధాంతాలు మెచ్చి నియోజకవర్గంలో చేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా మొగిలిచర్ల గ్రామము నుండి చేరిన వారిలో బండి రాజమ్మ, బండి కిషోర్ రెడ్డి, భీమవరపు సిసింద్రీ, పల్లాల రఘురామిరెడ్డి, వేముల మాలకొండయ్య, వేముల మార్కండేయులు, బాసం కొండలరావు, గోరంట్ల రాజేష్, స్వర్ణ రవి, ఇంద్రకంటి యెహోవా, స్వర్ణ ఆమోస్, లేటి.నాగేష్ తదితరులు బుర్రా. మధుసూదన్ యాదవ్ గారి సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు.