
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :-
రాష్ట్ర ప్రజలకు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఐశ్వర్యాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు.కులమతాలకు అతీతంగా ప్రజలందరూ సోదరభావం, ఐకమత్యంతో పండుగను జరుపుకోవాలని సూచించారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఈ విజయదశమి శుభాలను తీసుకురావాలని కోరారు. కూటమి ప్రజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించాలని, ప్రజల ఆశయాలు నెరవేరాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆకాంక్షించారు.