
తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు :-
కమ్యూనిస్టు పార్టీ సీనియర్ ( సిపిఐ )సభ్యులు, రిటైర్డ్ విఆర్ఓ కాట్రగడ్డ లింగయ్య( 82 ) మంగళవారం ఉదయం హైదరాబాదులోని ప్రగతి నగరలో మృతి చెందారు. అయన స్వగ్రామం పొన్నలూరు మండలం చౌటపాలెం. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన చదువుకుంటున్న రోజులలోనే వామపక్ష విద్యార్థి సంఘం వైపు ఆకర్షితలయ్యారు.1966 లో అయన సిపిఐ లో చేరి ఉద్యోగ బాధ్యతల్లోకి వెళ్లే వరకు పార్టీ లో క్రియాశీల సభ్యుడుగా పనిచేసారు సిపిఐ నిర్మాణం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. కొండపి శాసనసభ్యుడుగా దివి శంకరయ్య పోటీ చేసిన సమయంలో మాలపాడు గ్రామంలో జరిగిన అల్లర్ల సమయంలో ఆయన చూపిన ధైర్యం ఎప్పటికీ మరువలేనిది.కమ్యూనిస్టు పార్టీల ఐక్యతను అయన కోరుకునేవారు. ఉద్యోగ బాధ్యతలను ఆయన నీతి నిజాయితీగా పనిచేసి ఉన్నత అధికారుల ప్రశంసలు పొందారు. పేద ప్రజల సమస్యలపై ఎంతో శ్రద్దగా పని చేశారు. ఆయన మృతదేహాల్ని హైదరాబాదు నుండి ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రికి తరలించారు.అక్కడ మార్చురిలో ఉంచుతారు.లింగయ్య కుమారుడు అనిల్ అమెరికా నుండి బుధవారం సాయంత్రానికి కందుకూరు చేరుకుంటారు.అంత్యక్రియలు ఈనెల 22 న కందుకూరులో జరుగుతాయి.ప్రగతినగర్ లో ఆయన మృతదేహాన్ని మాజీ సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అఖిలభరత రైతుసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య లు సందర్శించి నివాళులు అర్పించారు.లింగయ్య మృతి కి సిపిఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య ప్రజానాట్యమండలి రాష్ట్ర మాజీ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా సీపీఐ కార్యదర్శి ఆర్ వెంకటరావు మార్కాపురం జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ మార్కాపురంజిల్లా ఏ ఐ టి యు సి ప్రధాన కార్యదర్శి సయ్యద్ యాసిన్,మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ అందె నాసరయ్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వీరారెడ్డి,కందుకూరు నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి బి సురేష్ బాబు సహాయ కార్యదర్శి పి బాలకోటయ్య మాజీ కార్యదర్శి పి మాలకొండయ్య ఎం లక్ష్మీనారాయణ, యు మాధవరావు, వై ఆనందమోహన్ తదితరులు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.