
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు విమర్శించారు.ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని, గతంలో ప్రతిపక్ష అభ్యర్థులకు ఆ అవకాశం లేకుండా చేసినవారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. బుధవారం కొడవలూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన నామినేషన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నార్త్ రాజుపాళెం–1 ఎంపీటీసీ స్థానానికి పోసింరెడ్డి మధురిమ, నార్త్ రాజుపాళెం–2 స్థానానికి పల్లా వెంకటేశ్వర్లు నామినేషన్లు దాఖలు చేశారు.