
నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ప్రత్యేక చర్యలు.. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం!
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రజలకు భద్రతా భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, సీఐ గారితో కలిసి గడియపూడి కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు.ఈ ఆపరేషన్లో భాగంగా కాలనీలోని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా సారించారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడంతో పాటు, నేరాల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు.