
ఉర్దూ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, రైటింగ్ ప్యాడ్లు పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండలోని ఈదిగమిట్ట ఉర్దూ పాఠశాలలో యూనిటీ ఆఫ్ ముస్లిం ఫెడరేషన్ (UMF) సింగరాయకొండ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు అష్ఫాఖుల్లా ఖాన్ జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, రైటింగ్ ప్యాడ్లను పంపిణీ చేశారు.బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అష్ఫాఖుల్లా ఖాన్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.దేశభక్తి, ఐక్యత, సేవాభావం వంటి విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలని యూనిటీ ఆఫ్ ముస్లిం ఫెడరేషన్ ప్రతినిధులు ఆకాంక్షించారు.
