
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ వెనుక ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆరిఫ్ గారి ఆధ్వర్యంలో 30 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. మున్సిపాలిటీలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతో, నాకు మద్దతుగా నిలిచిన ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించాను. కులమతాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చాను.కందుకూరు మున్సిపాలిటీలో సుమారు ₹150 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. HAM పథకం ద్వారా మంజూరైన ₹27 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నాం. ఆటోనగర్ ఏర్పాటు, అర్హులకు ఇళ్ల స్థలాల కల్పన, మైనారిటీ సోదరులకు ఉపాధి అవకాశాల మెరుగుదలకు కృషి చేస్తాను.కందుకూరులో ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ, అభివృద్ధి మరియు సంక్షేమంలో అందరినీ భాగస్వాములను చేయడమే నా సంకల్పం.