
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రకాశం జిల్లా ఎన్నికల అథారిటీ మరియు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, IAS, తాళ్లూరు, ముండ్లమూరు, దర్శి ప్రాంతాల్లో పర్యటించి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల్లోని హెల్ప్ డెస్క్లు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, నామినేషన్ కేంద్రాల పరిధిలో 100 మీటర్ల నిబంధనను పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.