
డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. పోలీసు అధికారులకు ఆదేశాలు.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లాలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా ఎస్పీ గారు పొన్నలూరు, కందుకూరు తదితర మండలాల్లోని నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు, బారికేడ్ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, అభ్యర్థులు, వారి ప్రతినిధుల వాహనాలు రాకపోకలను సమీక్షించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.నామినేషన్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిబంధనల ప్రకారం భద్రత అమలు చేయాలని, అనుమతి లేని వాహనాల రాకపోకలు, పార్కింగ్‌ను నియంత్రించాలని స్పష్టం చేశారు. ప్రజలు గుంపులుగా చేరకుండా, అనుమతి లేని ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అమల్లో ఉన్న పోలీసు 30 యాక్ట్,167 BNSS (144 సిఆర్.పి.సి) నిషేధాజ్ఞలు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల వద్ద డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని, పోలీసు అధికారులు వైర్లెస్ ద్వారా సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, అత్యవసర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఇతర విభాగాల సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
నామినేషన్ కేంద్రాలలో బెల్ హెల్లర్లు, పీఏ వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని,. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో అనవసర గుంపులు గుమిగూడకుండా నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. శాంతిభద్రతలను కాపాడుతూ, నామినేషన్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలి.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు ఎన్నికల నియమావళిని పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. జిల్లా ఎస్పీ గారి వెంట కందుకూరు డిఎస్పి బాలసుబ్రమణ్యం, ఎస్బిసిఐ శ్రీనివాసరావు, కొండేపి సీఐ రమణయ్య, ఆర్ఐ రమణారెడ్డి, పొన్నలూరు ఎస్సై శివ నాగరాజు, కందుకూరు ఎస్సై భార్గవ్ మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది ఉన్నారు.