
తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-
నవంబరు 3న జరగనున్న ఎంపీటీసీ ఎన్నికలకు సిపిఎం అభ్యర్థులుగా ఉలవపాడు సౌత్ కు కొమరగిరి శేషమ్మ,కరేడు సౌత్ కు మల్లవరం మల్లారపు లలితమ్మ లు శుక్రవారం మధ్యాహ్నం ఉలవపాడు ఎంపీడీవో ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రమేష్, సిపిఎం ఉలవపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జీవీబీ కుమార్ లు కలసి సిపిఎం అభ్యర్థులతో ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఉలవపాడు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి సురేష్ నాయుడు కు అందజేశారు.ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యం. రమేష్ మాట్లాడుతూ ఉలవపాడు మండల సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం, గిరిజన హక్కుల రక్షణ, సంక్షేమం కోసం,మండలం లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజల తరఫున నిరంతరం ఉద్యమాలు నిర్వహించే సిపిఎం పార్టీ జనరల్ స్థానాలలో గిరిజనులను పోటీకి నిలిపిందని తెలిపారు. ఉలవపాడు, కరేడు గ్రామాలలోని పేదలు, కార్మికులు, రైతులు, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల ప్రజలంతా సిపిఎం అభ్యర్థులకు మద్దతు తెలపాలని, ఎంపీటీసీ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థులను బలపరిచి గెలిపించాలని, పేదల వాణిని మండల పరిషత్ లో వినిపించేందుకు సిపిఎం అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరుతున్నాము. సిపిఎం అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో సిపిఎం ఉలవపాడు ప్రాంతీయ కమిటీ నాయకులు ఎస్.డి. గౌస్ బాషా, ఏలూరి నాగార్జున,వీసం విజయ్, కొమరగిరి వెంకటేశ్వర్లు, మాణికల ధనలక్షమ్మ పార్టీ కార్యకర్తలు వీసం.సురేంద్ర, అర్చన, నాగరాజు, కొమరగిరి.శ్రీను, తదితరులు పాల్గొన్నారు.