
తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:-
దర్శి టీడీపీ కార్యాలయంలో “చెప్పాం… చేస్తున్నాం” నినాదంతో రూపొందించిన పోస్టర్ను దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ ద్వారా 16,000 టీచర్ పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం, అన్నదాత సుఖీభవ, దీపం 2.0, తల్లికి వందనం, పేదలకు గృహనిర్మాణం వంటి పథకాలతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని వివరించారు.అలాగే, పట్టణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలంటే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.