
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా వేగం తగ్గించడంతో, వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టింది..ఈ ప్రమాదంలో వెనుక లారీలోని డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. ప్రమాద తీవ్రతకు డ్రైవర్ కాలికి తీవ్రగాయాలయ్యాయి.సమాచారం అందుకున్న హైవే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీసి, 108 అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.